కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌

- June 15, 2021 , by Maagulf
కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌

సూర్యాపేట: భారత్‌, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన సంగతి తెలిసిందే. వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కర్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని సూర్యాపేట‌లో ఆవిష్క‌రించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్‌ సంతోష్‌ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా కేటీఆర్‌ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌బాబు తల్లిదండ్రులతో​ పాటు ఆయన సతీమణి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య యాదవ్‌లతో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com