కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
- June 15, 2021
సూర్యాపేట: భారత్, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు అమరుడైన సంగతి తెలిసిందే. వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా కేటీఆర్ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌బాబు తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య యాదవ్‌లతో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







