కార్ల దొంగతనం: బహ్రెయినీ వ్యక్తికి జైలు
- June 15, 2021
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, ఓ బహ్రెయినీ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు రెండు కార్లను దొంగిలించి, వాటి టైర్లను పాడు చేశాడు. ఇలాంటి కేసులోనే ఏడాది క్రితం ఆ వ్యక్తి దోషిగా తేలాడు. ఓ వ్యక్తి ఫార్మసీ ముందు కారుని ఆపగా, అదను చూసి నిందితుడు ఆ కారుని దొంగిలించాడు. ఇలా రెండు కార్లను నిందితుడు దొంగిలించాడు. ఆ తర్వాత ఆ కార్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే, నిందితుడు ఆ కార్లను ధ్వంసం చేసినట్లుగా విచారణలో తేలింది. రెండు కార్లపైనా నిందితుడి వేలి ముద్రల్ని గుర్తించారు. గతంలో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించగా, ఆ తర్వాత మళ్ళీ అదే నేరానికి పాల్పడినందున ఈసారి శిక్ష మరింత ఎక్కువ కాలానికి పడింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







