సింగపూర్ నుంచి గన్నవరం చేరుకున్న విమానం
- June 15, 2021
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు నిలిచిపోయిన విదేశీ విమానాల రాకపోకలు మొదలయ్యాయి.సింగపూర్ కు చెందిన 37 మంది ప్రవాసాంధ్రులతో కూడిన ప్రయాణికుల ప్రత్యేక విమానం X 987 ఈ సాయంత్రం 05:29 ని.లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో గత నెల 3 నుంచి ఇక్కడి విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకుంది.

అయితే, వందే భారత్ మిషన్‌లో భాగంగా తిరిగి మళ్ళీ విమాన సర్వీసులను ప్రారంభించారు. సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల భద్రతా, తనిఖీ ఏర్పాట్లను ఎయిర్‌పోర్టు అధికారులు పర్యవేక్షించారు.తొలుత థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీల అనంతరం రాష్ట్రంలోకి అనుమతినిచ్చారు. అలాగే ప్రవాసాంధ్రులను వారి వారి గమ్యస్థానాలు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదన రావు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







