రానున్న వేసవి/పండుగ సెలవులు మరింత కీలకం - యూఏఈ

- June 15, 2021 , by Maagulf
రానున్న వేసవి/పండుగ సెలవులు మరింత కీలకం - యూఏఈ

యూఏఈ: పెరుగుతున్న కరోనా కేసులకు 'ఈద్ అల్ ఫితర్' సెలవులే ప్రధాన కారణమని నేడు మీడియా కు వివరించారు ఆరోగ్యశాఖ అధికారిక ప్రతినిధి.

'ఈద్ అల్ ఫితర్' సమయంలో ఎన్నో కఠిన నియమాలను ప్రభుత్వం అమలు చేసినప్పటికీ ప్రజలు సమావేశాలలో పాల్గొనడం, కోవిడ్ భద్రతా చర్యలను పాటించకపోవడం మూలంగా కేసులు పెరుగుతన్నాయి అని యూఏఈ ఆరోగ్యశాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ ఫరిదా అల్ హోసాని అన్నారు.

వేసవి సెలవులు రానున్నాయి..అందునా 'ఈద్ అల్ అదా' రానుంది, కావున ప్రజలు అన్ని భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు డాక్టర్ ఫరిదా. మాస్కులు ధరించడం, సురక్షితమైన సామాజిక దూరాన్ని పాటించడం మర్చిపోకూడదు అని హెచ్చరించారు.

వ్యాక్సిన్లు వేయించుకున్నాం కదా అని భద్రతా చర్యలను పాటించకపోతే కేసులు పెరిగిపోయి పరిస్థితులు తీవ్రతరం అయ్యే ఆస్కారం ఉంది అని ఆమె అన్నారు.

మే మధ్య వరకు రోజుకు 1500 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి..కాని తరువాత బాగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా, రోజువారీ కోవిడ్ కేసులు 2 వేలకు పైగా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంది కోవిడ్ భద్రతా చర్యలను ఎట్టిపరిస్థితుల్లో మర్చిపోకూడదు అని డాక్టర్ ఫరిదా మీడియాకు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com