రిస్ట్రిక్టెడ్ దేశాల నుంచి వచ్చేవారికి కొత్త మార్గదర్శకాలు

- June 15, 2021 , by Maagulf
రిస్ట్రిక్టెడ్ దేశాల నుంచి వచ్చేవారికి కొత్త మార్గదర్శకాలు

యూఏఈ: ఇండియా, పాకిస్తాన్, నైజీరియా, నేపాల్ మరియు ఉగండా తదితర దేశాల నుంచి వచ్చే చార్టర్ విమానాల ప్రయాణీకులకు సంబంధించి కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది యూఏఈ. ప్రయాణీకులు పది రోజులపాటు ట్రాకింగ్ డివైజ్ ధరించి వుండాలి. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అబుదాబీ, షార్జా మరియు రస్ అల్ ఖైమా వచ్చేవారికి ఆ డివైజ్‌లను అందించడం జరిగింది. ట్రావెల్ ఏజెన్సీలు ఇతర చార్టర్ ఫ్లైట్ ఆపరేటర్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. 14 రోజుల హోం క్వారంటైన్ నేపథ్యంలో డివైజ్‌లను ధరించాలని అబుదాబీ స్పష్టం చేసింది. వచ్చేవారు తమ వెంట పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ తీసుకురావాలి. దేశంలోకి వచ్చాక నాలుగు రోజులకు అలాగే 8 రోజులకు టెస్ట్ చేయించుకోవాలి. దుబాయ్‌లో 10 రోజులపాటు ఐసోలేషన్ తప్పనిసరి. పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. చార్టర్ విమానాల సిబ్బంది కూడా నిబంధనలు పాటించాలి. ట్రాన్సిట్ సమయంలో ప్రయాణీకులు హోటల్ క్వారంటైన్ పొందాలి. యూఏఈ ప్రజలతో కలవకుండా హోటల్ - ఎయిర్ పోర్టు మధ్యనే ప్రయాణించాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com