దిగ్బంధ చర్యలు తొలగించాల్సిందే..కువైట్ ట్రావెల్ అసోసియేషన్ పిలుపు
- June 17, 2021
కువైట్: కరోనా వ్యాప్తి నియంత్రణకు కువైట్ అనుసరిస్తున్న ప్రయాణ ఆంక్షల విధానాన్ని ఆ దేశ ట్రావెల్& టూరిజం అసోసియేషన్ ఏజెన్సీ తప్పుబట్టింది. ప్రపంచ దేశాల నుంచి వేరు చేస్తున్నట్లు తమకు తాము కువైట్ అసోలేట్ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి..ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేయాల్సిందిగా పిలుపునిచ్చింది. దేశ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయటం అనివార్యమని కోరింది. కోవిడ్ నియంత్రణకు కువైట్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు అనుసరిస్తూ వస్తోందని, రెండేళ్లుగా ప్రయాణాలపై బ్యాన్ విధించినా కొత్త విధానాన్ని అంతా స్వాగతించినట్లు ఏజెన్సీలు గుర్తు చేశాయి. అయితే..కువైట్ ను ప్రపంచం నుంచి వేరు చేసే ఈ చర్యలు ఇంకా ఎంతకాలం పొడిగిస్తారని ప్రశ్నించింది. నిర్దిష్ట ప్రణాళిక, ఓ ముగింపు లేని ఈ విధానానికి వెంటనే ముగింపు పలకటం దేశ ఆర్ధిక వ్యవస్థకు మంచిదని అభిప్రాయపడింది. అంతేకాదు..కఠిన ఆంక్షలు అమలులో ఉన్నా దేశంలోకి డెల్టా వేరియంట్ రావటాన్ని ప్రస్తావిస్తూ ట్రావెల్ బ్యాన్ తో ఒరిగేది ఏమి లేదని పేర్కొంది. దేశ పౌరులు ఇతర దేశాలకు వెళ్లి రావొచ్చు, కానీ, ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులకు రాకపై నిషేధం విధించటం ద్వారా వైరస్ ను ఎలా అడ్డుకోగలరంటూ సందేహం వ్యక్తం చేసింది. ఇలా ఎంత కాలం ప్రపంచానికి దూరంగా తమకు తాము దిగ్బంధం చేసుకోని ఉంటారని, వెంటనే ట్రావెల్ బ్యాన్ పై పునరాలోచాలని కోరింది. ప్రయాణాలకు అనుమతిస్తూనే కోవిడ్ వ్యాప్తి ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టి సారించాలని కోరింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







