80% ఉద్యోగులతో ఆఫీసుల నిర్వహణకు అనుమతి
- June 17, 2021
ఖతార్: కోవిడ్ తీవ్రత కొద్దిమేర తగ్గుముఖం పట్టడంతో ఖతార్ ప్రభుత్వం దశలవారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ రంగంలోని ఆఫీసులు తమ పూర్తి సామర్ధ్యంలో 80 శాతం ఉద్యోగులను విధులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. వైద్య, మిలటరీ, భద్రతా రంగాలకు సంబంధించి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు మంత్రి మండలి ప్రకటించింది. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తు పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య వివాహాలు జరుపుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. జూన్ 18 నుంచి ఈ సడలింపులు అమలులోకి వస్తాయి. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మే 28 నుంచి జులై 30 లోగా నాలుగు దశలుగా ఆంక్షలను ఎత్తివేయాలని గత నెలలోనే మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆఫీసులకు 80 శాతం ఉద్యోగుల అనుమతి, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులకు పర్మిషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







