హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్

- March 07, 2016 , by Maagulf
హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్

దేశంలో అలజడి సృష్టించి పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు అందడంతో హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్ కొనసాగుతున్నది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి గుజరాత్‌లోకి 10 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘావర్గాలు తెలుపడంతో రాష్ర్టాల్లో కేంద్ర హోంశాఖ రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. లష్కరే తాయిబాతో కలిసి జైషే మహమ్మద్ భారత్‌లో బాంబు పేలుళ్లకు పథకం రూపొందించిందని మొదటిసారిగా పాక్ భద్రతా సలహాదారులు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించారు. దీనితో దేశంలోని మెట్రోనగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పుణెలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయ రాష్ర్టాల పోలీస్ శాఖలను ఐబీ హెచ్చరించింది.ఈనేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై హైదరాబాద్‌లో పలుచోట్ల వాహనాలతనిఖీలు, సోదాలు నిర్వహించారు. మెట్రోనగరాల్లోని రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు,ఎయిర్‌పోర్టులు, కేంద్ర కార్యాలయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని హోంశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నాకాబందీ నిర్వహించడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com