భారత్ లో కరోనా కేసుల వివరాలు

- June 18, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులతో పాటుగా మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కొత్త‌గా 62,480 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు భారత్ లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,97,62,793 కి చేరింది. ఇందులో 2,85,80,647 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,98,656 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 1,587 మంది మృతిచెందారు.దీంతో భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,83,490 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 88,977 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 26,89,60,399 మందికి వ్యాక్సిన్ అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com