వ్యాక్సిన్ తీసుకున్నవారికే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి
- June 18, 2021
కువైట్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ ప్రాంతాల్లోకి వ్యాక్సిన్ పొందినవారిని మాత్రమే అనుమతించనున్నట్లు కువైట్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ పొందని వారికి పబ్లిక్ ప్రాంతాల్లో ఎంట్రీ ఉండదని స్పష్టం చేసింది. పెద్ద పెద్ద షాపింప్ మాల్స్, జిమ్ములు, సెలూన్లు, ప్రభుత్వ సంస్థలు సేవలు అందించే సెంటర్లకు ఇక నుంచి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతించనున్నారు. ఈ నెల 27 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. మాల్స్, సెలూన్లు, జిమ్ములతో పాటు ఇతర పబ్లిక్ సర్వీసు సెంటర్లకు వెళ్లే వారి 'ఇమ్యూన్' యాప్ ద్వారా వ్యాక్సిన్ స్టేటస్ ను ధృవీకరించుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తారు. అంతేకాదు వ్యాక్సిన్ పొందిన కువైట్ పౌరులకు మాత్రమే విదేశాలకు వెళ్లి వచ్చేందుకు అనుమతి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు వైద్య పరంగా మినహాయింపు పొందినవారికి ఎలాంటి నిబంధనలు వర్తించవని వెల్లడించింది. ఇక విదేశీయుల రాకపై కూడా కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఫారెనర్లను దేశంలోకి అనుమతించనున్నట్లు వెల్లడించింది. అయితే..కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఫైజర్, ఆస్ట్రాజెన్కా, మోడెర్న వ్యాక్సిన్ అయితే రెండు డోసులు, జాన్సన్&జాన్సన్ అయితే వన్ షాట్ తీసుకోని ఉండాలని షరతు విధించింది. అలాగే కువైట్ బయల్దేరే సమయానికి 72 గంటల్లో పొందిన పీసీఆర్ నెగటీవ్ టెస్ట్ రిపోర్ట్ కూడా తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ఆగస్ట్ ఒకటి నుంచి విదేశీయులకు రాకకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించినా..రెడ్ లిస్ట్ దేశాల నుంచి కువైట్ వచ్చేందుకు ఎదురు చూస్తున్న వారి విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







