ఫ్రంట్ లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టల్ స్టాంప్
- June 18, 2021
సౌదీ: కోవిడ్ ను ఎదుర్కొనేందుకు నిరంతరంగా శ్రమిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలుపుతూ సౌదీ ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ తో పాటు పోస్ట్ కార్డును విడుదల చేసింది. వారి సేవలకు గుర్తింపుగా SR3 పోస్టల్ స్టాంప్, SR5 పోస్ట్‌కార్డ్ లపై 'మా హీరోలకు ధన్యవాదాలు' అనే టైటిల్ ను ముద్రించింది. ప్రణాంతకమైన వైరస్ పై పోరాటంలో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు, దేశ ప్రజల పట్ల అంకితమైన భావంతో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల సేవలను కొనియాడింది. ఇదిలాఉంటే..జాతీయ, అంతర్జాతీయ, మతపరమైన ఈవెంట్లతో పాటు ముఖ్యమైన సెలవులు, హజ్ సీజన్, కళాత్మక, సాంస్కృతిక, క్రీడల నిర్వహణ సమయంలో వాటి ప్రాముఖ్యతను చాటేలా పోస్టల్ స్టాంప్ విడుదల చేయటం పరిపాటిగా వస్తోంది. అలాగే అంతర్జాతీయ, ఇస్లామిక్, అరబ్, గల్ఫ్ స్థాయిలలో సమావేశాల సమయంలో సౌదీ విజయాలు చాటిచెప్పేలా తపాలా బిళ్ళలను సౌదీ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలుపుతూ వారి సేవలను కీర్తిస్తూ పోస్టల్ స్టాంప్, పోస్టల్ కార్డులను విడుదల చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







