హెల్త్ కేర్ వర్కర్లకు కొత్త వీసాల జారీకి కువైట్ ఆమోదం

- June 18, 2021 , by Maagulf
హెల్త్ కేర్ వర్కర్లకు కొత్త వీసాల జారీకి కువైట్ ఆమోదం

కువైట్ సిటీ: కోవిడ్ నేపథ్యంలో విదేశీయులను దేశంలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించిన కువైట్..ఎట్టకేలకు వైద్య రంగంలో సేవలు అందించే విదేశీయుల ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కోవిడ్ 19 ఎమర్జెన్సీ కమిటీ విదేశీ మెడికల్ స్టాఫ్ కు కొత్త వీసాలు జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో  మెడికల్, నర్సింగ్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉపాధి పొందుతున్న సిబ్బందికి కువైట్ చేరుకునేందుకు అడ్డంకులు తొలిగిపోనున్నాయి. అయితే..వైద్య రంగం మినహా ఇతర దేశాల వారికి దేశంలోకి అనుమతి లేదని, వారిపై ప్రయాణ ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com