సోనియా గాంధీతో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ
- June 18, 2021
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సమావేశమయ్యారు.ఇవ్వాళ ఆయన తన భార్యతో కలిసి సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు.తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చాక సోనియాతో స్టాలిన్ సమావేశమవ్వడం ఇదే తొలిసారి. సమావేశం సందర్భంగా రాష్ట్ర రాజకీయ, అధికార పరిస్థితుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.
స్టాలిన్, ఆయన భార్య దుర్గావతి స్టాలిన్ తో సమావేశమవడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల కోసం మెరుగైన పాలన అందించేందుకు, తమిళనాడు అభివృద్ధికి డీఎంకేతో కలిసి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటామని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశమైన సంగతి తెలిసిందే.ఆ సమావేశంలో భాగంగా సీఏఏ, సాగు చట్టాలు, నీట్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాకుండా టీకాల సరఫరా, జీఎస్టీ పరిహారం చెల్లింపు, శ్రీలంక తమిళులకు హక్కులు వంటి విషయాలపైనా చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







