ఏపీ:క‌ర్ఫ్యూలో మ‌రిన్ని స‌డ‌లింపులు..

- June 18, 2021 , by Maagulf
ఏపీ:క‌ర్ఫ్యూలో మ‌రిన్ని స‌డ‌లింపులు..

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తోంది ప్ర‌భుత్వం..పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతుండ‌డంతో.. స‌డ‌లింపులు ఇస్తూ వ‌స్తున్నారు.. ఇక‌, గ‌తంలో ప్ర‌క‌టించిన క‌ర్ఫ్యూ తేదీ ముగుస్తున్న త‌రుణంలో.. కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళ‌లు స‌డ‌లిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.తాజా నిర్ణ‌యం ప్ర‌కారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ స‌డ‌లింపులు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.ఈ నెల 20వ తేదీ త‌ర్వాత నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయి.సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల‌ని.. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించిన సీఎం జ‌గ‌న్.. అయితే, కోవిడ్ కేసులు అధికంగా న‌మోదు అవుతోన్న తూర్పు గోదావ‌రి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కే స‌డ‌లింపులు అమ‌ల్లో ఉంటాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రెగ్యుల‌ర్ టైమింగ్స్ ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాల‌ని సూచించారు.

ఈ సమావేశానికి ఉపమఖ్యమంత్రి(వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి( కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com