పూర్తిగా వ్యాక్సినేషన్ అయిన సిబ్బందితో ‘ఢిల్లీ నుంచి దుబాయ్’కి తొలి విమానం
- June 18, 2021
దుబాయ్: ఢిల్లీ - దుబాయ్ మార్గంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తొలి అంతర్జాతీయ విమానాన్ని పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందిన సిబ్బంది ద్వారా నడపడం ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ఉదయం 10.40 నిమిషాలకు బయల్దేరిన విమాన సిబ్బంది పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందారు. కెప్టెన్ డి.ఆర్. గుప్తా, కెప్టెన్ అలోక్ కుమార్ నాయక్ ఈ విమానాన్ని నడిపారు. క్యాబిన్ క్రూ మెంబర్స్ వెంకట్ కెల్లా, ప్రవీణ్ చంద్ర, ప్రవీణ్ చౌగ్లే మరియు మనీషా కాంబ్లెలతో విమానం బయల్దేరింది. అర్హులైన క్రూ మెంబర్స్ అలాగే ఫ్రంట్ లైన్ స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ చేయించినట్లు ఎయిర్ లైన్ సంస్థ వెల్లడించింది. వందే భారత్ మిషన్ ప్రారంభమయ్యాక ఓ విమానం పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన సిబ్బందితో ఇండియా నుంచి ఆపరేట్ అవడం తమతోనే మొదలైందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







