పేటెంట్లలో టాప్ 100లో చోటు దక్కించుకున్న కింగ్ అబ్ధుల్లాజీజ్ వర్సిటీ
- June 19, 2021
సౌదీ: సౌదీకి చెందిన కింగ్ అబ్ధల్లాజీజ్ వర్సిటీ ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుకుంది. యూనైటెడ్ స్టేట్స్ లో ఏకంగా 71 పేటెంట్లను సాధించి ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీ లిస్టులో 33వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే 49 స్థానాలు ఎగబాగి ఈసారి 33వ స్థానంలో నిలిచింది. ఈ అత్యున్నత జాబితాలో చేరిన తొలి ఏడాదిలోనే వివిధ విభాగాల్లో 34 పేటెంట్లు సాధించి 82వ స్థానంలో నిలిచిన కింగ్ అబ్ధల్లాజీజ్ వర్సిటీ అతి తక్కువ సమయంలోనే 33వ స్థానానికి చేరుకోవటం విశేషం. ఇది పురోగతి వర్సిటీ నాణ్యత ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సారి సాధించిన 71 పేటెంట్లలో ఆరోగ్య సంరక్షణ రంగంలో 27 పేటెంట్లు, అభివృద్ధి పరిశ్రమల రంగంలో 22, సహజ వనరుల అభివృద్ధిలో 18, కృత్రిమ మేధస్సు, సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో నాలుగు పేటెంట్లు ఉన్నాయి.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







