'ఓకే టు బోర్డ్' అంటే ఏమిటి?
- March 07, 2016
దుబాయ్‌కి వెళ్ళే ప్రయాణీకులు తమ వీసా వెరిఫికేషన్‌ని పూర్తి చేసుకోవలసి ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత, సంబంధిత అధికారి 'ఓకే టు బోర్డ్' మెసేజ్‌ని పిఎన్‌ఆర్‌లో ఇన్సెర్ట్ చేస్తారు. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారంతా 'ఓకే టు బోర్డ్'ను పొందవలసి ఉంటుంది. యూఏఈ (దుబాయ్, షార్జా మరియు అబుదాబీ)కి వెళ్ళాలనుకుంటే పిఎన్ఆర్ ఖచ్చితంగా 'ఓకే టు బోర్డ్' అనే మార్కింగ్ పొందవలసి ఉంటుంది. వీసా వచ్చిన తర్వాత వీసా కాపీని ఎయిర్‌లైన్‌కి రీ-చెకింగ్ కోసం పంపాలి. వీసాని చెక్ చేసిన తర్వాత ఎయిర్‌లైన్స్ సంస్థ అప్రూవల్ ఇస్తుంది. ఓకే టు బోర్డ్ అని లేకపోతే ప్రయాణానికి అనుమతించరు. యూఏఈకి వెళుతున్నవారిలో చాలామంది ఫేక్ వీసాల ద్వారా వెళ్తుండడంతోనే ఈ చర్యలను చేపట్టారు. మామూలుగా అయితే సంబంధిత స్పాన్సరర్లు 'ఓకే టు బోర్డ్'ని పూర్తి చేస్తారు. వారే పిఎన్ఆర్ మరియు చెల్లబాటు అయ్యే వీసా కాపీని ఎయిర్‌లైన్స్ అధికారులకు పంపుతారు. ఎయిర్‌లైన్స్ సంస్థ వెరిఫై చేసి, 'ఓకే టు బోర్డ్' మెసేజ్‌ని పిఎన్‌ఆర్‌లో పేర్కొంటుంది.
తాజా వార్తలు
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







