టీటీడీ కీలక నిర్ణయం

- June 19, 2021 , by Maagulf
టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలయ నిర్ణయం తీసుకుంది.దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది.ఈ మేరకు ఈరోజు జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. సమావేశానంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 18 నెలల్లో కశ్మీర్ లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి గుడిలో ఓ గోమాతను ఉంచతామతని తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని దాదాపు 100 గుళ్లలో అమలు చేస్తున్నట్టు చెప్పారు.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని తెలిపారు.

ఇక, తిరుమలను గ్రీన్ జోన్‌గా ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని తెలిపారు.

టీటీడీ పరిధిలో అన్ని విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. 90 రోజుల్లో దీనికి సంబంధించిన ముసాయిదాను తీసుకురాబోతున్నామని చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని శాశ్వత ప్రాతపదికన నియమిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సహజ పంటలపై అన్ని జిల్లాలకు చెందిన రైతులతో త్వరలోనే చర్చిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com