తెలంగాణ: జులై 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం
- June 19, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగం చిన్నాభిన్నం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కరోనా వల్ల చాలా నష్ట పోయారు. అటు థర్డ్ వేవ్ కూడా పిల్లలపై ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో.. తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జూలై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలు ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులు, సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ పలు సూచనలు చేసింది. కాగా తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. లాగ్ డౌన్ ఎత్తి వేసినంత మాత్రాన కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని.. మాస్కులు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









