మార్చ్ 10న యానిమల్ పార్క్ ప్రారంభం
- March 07, 2016
డైనోసార్స్, గాడ్జిల్లా, కింగ్ కాంగ్ వంటి పురాతనకాలం నాటి జీవులను దగ్గరనుంచి చూసే అవకాశం కలగనుంది. యానిమల్ పార్క్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అచ్చంగా నిజమైన డైనోసార్స్, గాడ్జిల్లా, కింగ్ కాంగ్లను తలపించేలా వాటి ప్రతిమల్ని ఏర్పాటు చేశారు. కతార్ స్పోర్ట్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ని గురువారం ప్రారంభిస్తారు. ఏప్రిల్ 2 వరకు ఉండే ఈ యానిమల్ పార్క్‌ని దుబాయ్‌కి చెందిన సిఎసి ఈవెంట్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఎజె ఎంటర్టైన్మెంట్ - దోహా, ఖతార్ టూరిజం అథారిటీతో కలిసి సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రతిమలూ విభిన్న రకాలైన శబ్దాలతో, ఆశ్చర్యం కలిగించే మూమెంట్స్‌తో సందర్శకుల్ని అలరించనున్నాయి. తోక ఆడించడం, నోటిని తెరవడం, నీటిని వెదజల్లడం వంటివి ఇందులో మరికొన్ని ఆకర్షణీయ అంశాలు. ఆయా జీవులకు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లీషు, అరబిక్ బాషల్లో పొందుపరిచారు. పార్క్‌లో కిడ్స్ ఎరీనా ఉంటుంది. ఇందులో చిన్న చిన్న యానిమల్ మోడల్స్‌ని ఉంచారు. వాకింగ్ అండ్ కౌబాయ్ డైనోసార్ పార్క్ అంతటా తిరుగుతూ సందర్శకుల్ని అలరించనుంది. ఉదయం 4 నుంచి 11 గంటలవరకు ప్రతిరోజూ, శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పార్క్‌ని తెరిచి ఉంచుతారు. స్కూల్ విద్యార్థుల కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రత్యేక సందర్శనకు అనుమతిస్తారు. 12 ఏళ్ళలోపు పిల్లలకు 15 ఖతార్ రియాల్స్ టిక్కెట్, పెద్దలకు అయితే 25 ఖతార్ రియాల్స్ టిక్కెట్ ధరను నిర్ణయించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







