అల వైకుంఠపురములో రీమేక్‌లో మనీషా కోయిరాలా..!
- June 20, 2021
మన తెలుగు సినిమాలు వివిధ భాషలలో రీమేక్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురంలో చిత్రం హిందీలో రీమేక్ అవుతుండగా, ఈ రీమేక్‌కు దర్శకుడు డేవిడ్ ధావన్ ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసాడట. ప్రస్తుతం సినిమాలో నటినటుల ఎంపిక జరుగుతుంది.

అలవైకుంఠపురంలో నటించిన అల్లు అర్జున్ – పూజాహెగ్డే పాత్రల్లో బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్ – కృతిసనన్ ఎంపికయ్యారు. ఇక తల్లి క్యారెక్టర్ కోసం తెలుగులో టబు పోషించిన పాత్రని సీనియర్ బ్యూటీ మనీషా కోయిరాల చేయనుందట. ముందుగా టబునే అనుకున్నప్పటికీ ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడం వలన మనీషా కోయిరాలతో దర్శకనిర్మాతలు చర్చలు జరిపారట. అయితే ఆల్రెడీ మనీషా కోయిరాల ఓకే అయినట్లు ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన రాబోతుంది. ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







