ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త
- June 20, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ పెంపు జూలై నెల నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇలా వేతనాలు పెంచడం ఇది రెండోసారి. వలసలను తగ్గించడానికి, నైపుణ్యం కలిగిన సిబ్బందిని తిరిగి రప్పించడానికి సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది తొలి నెల జనవరిలోనే సంస్థ జీతాలు పెంచిన విషయం తెలిసిందే.
అయితే శనివారం కంపెనీ 40వ వార్షికోత్సవ సాధారణ సమావేశంలో కంపెనీ సీవోవో ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. ఐటీ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే వలసలు అధికంగా ఉండటం కూడా మరో కారణమని పేర్కొన్నారు.
గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 20 వేల మంది గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని, ఇప్పటికే విప్రో 80 శాతం మంది సిబ్బంది వేతనాలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు వచ్చే సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







