కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డ్
- June 20, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డ్ నెలకొల్పింది. సాయంత్రం 4 గంటలకే 10.93 లక్షల మందికి పైగా వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్ నడుస్తోంది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ జరుగుతోంది.కాగా, కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది.వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసింది.కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే లక్ష్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది. మరోవంక గ్రామాల్లో ఫీవర్ సర్వేను నిరంతరం కొనసాగిస్తూ... లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షించి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స చేసే (టీటీటీ) వ్యవస్థను కూడా పకడ్బందీగా కొనసాగిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,25,679 వ్యాక్సిన్లు వేయగా, అత్యల్పంగా విజయనగరంలో 48,689 వ్యాక్సిన్ డోసులు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1, 21,389, కృష్ణా: 1,08,730,విశాఖ: 94, 913, శ్రీకాకుళం: 77,742, గుంటూరు: 80,857, నెల్లూరు: 70, 359, ప్రకాశం: 73, 759, చిత్తూరు: 72,544, కర్నూలు: 60, 669, అనంత: 56, 811, కడప: 50, 091 డోసులు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







