‘మ్యాస్ట్రో’ షూటింగ్ పూర్తి
- June 20, 2021
హైదరాబాద్: హీరో నితిన్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘మ్యాస్ట్రో’. నితిన్ 30వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ‘మ్యాస్ట్రో’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.‘మ్యాస్ట్రో’ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన సంగతి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలు ఇవి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్లో పాల్గొన్న ఫస్ట్ స్టార్ హీరో మూవీ ‘మ్యాస్ట్రో’ కావడం విశేషం.ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘మ్యాస్ట్రో’ ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు నితిన్ హిట్ మూవీ ‘భీష్మ’కు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగరే.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







