తెలుగు ప్రజలకు భావోద్వేగ లేఖ రాసిన సీజేఐ ఎన్వీ రమణ
- June 20, 2021
హైదరాబాద్: తెలుగు ప్రజల రుణం తీర్చుకోలేనిదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగానికి గురయ్యారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇటీవల ఏపీ, తెలంగాణలో పర్యటించిన ఆయన.. తన అనుభూతులతో కూడిన లేఖను విడుదల చేశారు. భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో తనను చూసి గర్వించడానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న ఆలోచన తనను బాధిస్తుండేదని, కానీ సీజేఐగా గత వారం రోజులు పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్‌ను సైతం లెక్కచేయకుండా అసంఖ్యాకంగా వచ్చి తనను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పర్యటన ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఆదరాభిమానాలు చూపిన తెలుగు ప్రజలకు శతకోటి వందనాలు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటన తనను భావోద్వేగాలకు గురిచేసిందని ఎన్వీ రమణ చెప్పారు. తెలుగు ప్రజల దీవెనలతో సీజేఐ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తానని ఉద్ఘాటించారు. తెలంగాణ రాజ్ భవన్, హైకోర్టు, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తిరుమల, యాదాద్రి, శ్రీశైలం పాలకమండళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







