భారత్ వ్యాక్సిన్ పై క్లారిటీ ఇచ్చిన యూఏఈ
- June 21, 2021
యూఏఈ: ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనకా కోవిడ్ 19 వ్యాక్సిన్, భారతదేశంలో కోవిషీల్డ్ పేరుతో విక్రయించబడుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈ ఆమోదం పొందినదేనని దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. కోవిషీల్డ్ తీసుకున్నవారు భారతదేశం నుంచి యూఏఈకి వస్తే, వ్యాక్సినేషన్ పొందినట్లు గుర్తిస్తారా.? లేదా.? అన్నదానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సందేహాలకు యూఏఈ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈలో ఆమోదం పొందిన వ్యాక్సిన్ అని.. యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ ప్రయాణీకుల్ని, తగిన ప్రోటోకాల్స్ అనుగుణంగా అనుమతిస్తామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!







