ఖతార్ లోని పలు ప్రాంతాల్లో యోగా డే వేడుకలు

- June 22, 2021 , by Maagulf
ఖతార్ లోని పలు ప్రాంతాల్లో యోగా డే వేడుకలు

దోహా: ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖతార్ లోని పలు ప్రాంతాల్లో యోగా డే నిర్వహించారు. నిపుణులైన యోగా అభ్యాసకుల నేతృత్వంలో ఆరు వేర్వేరు ప్రదేశాలల్లో ఔత్సాహికులు యోగాసానాలను అభ్యసించారు. ఖతార్లోని మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్-MIA పార్క్‌, అల్ ఖోర్ పట్టణం అల్ బేట్ స్టేడియం ముందు,మెసాయిద్ ఇసుక దిబ్బలపై, ఏషియన్ టౌన్, అల్ వక్రా, దుఖాన్ బీచ్ లలో యోగాసానాలు వేశారు. భారత క్రీడా కేంద్రంతో సమన్వయంతో దోహాలోని భారత రాయబార కార్యాలయం యోగా డేని నిర్వహించింది. దుఖాన్ సముద్ర తీరం నుంచి మెసాయిద్ ఇసుక తిన్నెల వరకు ఖతార్ భౌగోళిక వైవిధ్యం యోగా దినోత్సవానికి మరో ఆకర్షణగా నిలిచింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో నిబంధనలకు లోబడి భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కొందరు వర్చువల్ గా యోగ దినోత్సవంలో పాల్గొనగా.. MIA పార్క్ దగ్గర జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్న భారత్ రాయబారి యోగసనాలు అభ్యసించారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే శక్తి యోగాకు ఉందని, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైరస్ ను ఎదుర్కొవటంలో యోగా దోహదపడుతుందని రాయబారి అన్నారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com