కువైట్: కోవిడ్ తీవ్రతపై సమీక్షించిన మంత్రివర్గం
- June 22, 2021
కువైట్: తగ్గినట్లే తగ్గి మళ్లీ వైరస్ తీవ్రత మళ్లీ పెరగటంతో కువైట్ మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఒక్కటిగా నిలిచి మహమ్మారిపై పొరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది. దేశంలో కోవిడ్ తీవ్రతపై ఆరోగ్య మంత్రి డాక్టర్ బాసెల్ అల్సాబా మంత్రి మండలికి వివరించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కువైట్ ఆమోదించిన వ్యాక్సిన్ సురక్షితమైనవని, కమ్యూనిటీ ఇమ్యూనిటీ సాధించటంలో ఇవి దోహదపడుతాయని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ వేసుకోవటం ద్వారానే వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే కువైట్ వ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధికంగా 1,935 మంది వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







