‘కిరాతక’గా ఆది సాయికుమార్!
- June 22, 2021
హైదరాబాద్: లవ్‌లీ రాక్‌స్టార్ ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిరాతక అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పూత్ నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ ఆది కుమార్ హీరోగా నా దర్శకత్వం వచ్చిన 'చుట్టాలబ్బాయి' చక్కని విజయాన్ని అందుకుంది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్‌లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా నటిస్తుంది.విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి అన్‌కాంప్రమైజ్‌డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి విజువల్స్ తప్పకుండా సినిమాకి ప్లస్ అవుతాయి అన్నారు. చిత్ర నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ”డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ వీరభద్రం చెప్పిన కథ బాగా నచ్చింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం“ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







