‘మా’ అధ్యక్షుడి రేసులో ప్రకాశ్ రాజ్,విష్ణు
- June 22, 2021
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా వెలువడనప్పటికీ.. ‘మా’ అధ్యక్షుడి రేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు ఉన్నారు. వీరిద్దరికీ కూడా సినీ రంగంలో పరిచయాలు, సాన్నిహిత్యాలు ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు తన కుమారుడు మంచు విష్ణు కోసం మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ కృష్ణను ఈరోజు ఆయన కలిశారు. కృష్ణ నివాసానికి విష్ణుతో కలిసి మోహన్ బాబు వెళ్లారు. విష్ణుకు మద్దతును ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరినట్టు సమాచారం. కృష్ణతో కలిసి మోహన్ బాబు, విష్ణు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, వీరి సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు.
‘మా’ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెగా కుటుంబం మద్దతిచ్చే వారు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిరంజీవితో మోహన్ బాబుకు మంచి స్నేహం ఉంది. దీంతో, విష్ణును చిరంజీవి సపోర్ట్ చేసే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. బాలకృష్ణతో కూడా మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉంది. మరోవైపు చిరంజీవితో ప్రకాశ్ రాజ్ కు కూడా సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి మద్దతు తనకు పలుకుతారనే ఆశాభావంలో ఆయన కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







