మహిమాన్విత

యాస లోనైతేనేం గిరిజన బాషలోనైతేనేం
తల్లిగా నీ ప్రసవం ఒకటే ఆ లాలింపూ.. ఒకటే

నీ ప్రేమకోసం తపన పడే ఒకరికి యుద్ధం,
నీ ఓదార్పే ఒకరికి సింహాసనం
నిన్ను గెల్చుకోవడమే ఒకరికి రాజ్యాధికారం

నీ తోడుతో జీవన నౌకను నడిపిన నావికుడికి
చిరకాలపు.. సేద దీర్చు ఒక సుమధుర తల్పం నువ్వు

బ్రతుకు పోరులో అలసిన వారికీ
దేవుడిచ్చిన గొప్ప వరం నీ ఒడి,

నీ చిట్టి చేతులే ఎడారి బాటసారికి
చల్లని వింజామరలు మళ్లీ

నువ్వొక దినానికి కట్టిన ఒక రూపు రేఖవు కాదు
వెరసి సర్వ మానవాళి ఇచ్చలు దీర్చు ...

కలియుగ కల్ప వృక్షానివి నువ్వు .. ఓ అతివ
ఓ మహిళా.. గొప్ప మహిమాన్వితవు నువ్వే నువ్వే ... !

(08-03-2014. మహిళా దినోత్సవం సంధర్భంగా మహిళా మణులు అందరకు శుభాకాంక్షలు )

 

--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Back to Top