ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..!
- June 22, 2021
అమరావతి: ఏపీ ప్రభుత్వ తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో, ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని... ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీని ఎందుకు మినహాయించాలని వ్యాఖ్యానించింది. 12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? చెప్పాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం
- ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక ప్రదర్శన–సినిమా రంగానికి కొత్త దిశ
- గ్లోబల్ సమ్మిట్.. సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!







