ఐసీఐసీఐ బ్యాంకు మహిళల కోసం బంపర్ ఆఫర్ ...
- March 08, 2016ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు మహిళల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకనుంచి ఇంటి దగ్గర ఉండి పనిచేసేందుకు వీలుగా అవకాశం తెచ్చిపెట్టింది. 'ఐ వర్క్@హోమ్' పేరిట ప్రత్యేక పోర్టల్ ను తీసుకొచ్చి తమ సంస్థకు చెందిన ఉద్యోగినులు ల్యాప్ టాప్ ద్వారా బ్యాంకు లావాదేవీలు చూసేందుకు వీలు కల్పించింది. ఈ విధానం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే మహిళలకు అమితంగా ఉపయోగపడనుంది.తమ బ్యాంకులో పనిచేసే మహిళలకు పెద్దగా ఇబ్బందులు కలగకూడదని ఐసీఐసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్ మాట్లాడుతూ తాము నిర్వహించిన సర్వేలో మహిళలు మెటర్నటీ కారణంగా విధులకు దూరం కావాల్సి వస్తుందని, ఇంకొందరైతే రాజీనామాలు చేస్తున్నారని గుర్తించామని చెప్పారు.
'ఇకపై మహిళలు ఇబ్బందుల కారణంగా విధులకు దూరం అయ్యే సమస్య లేకుండా ఓ బలమైన వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించాం. వర్క్ ఎట్ హోమ్ విధానం తెచ్చాం. ఇప్పటికే 50 మంది మహిళలు ఇలా పనిచేస్తున్నారు. మరో 125 మంది ఇలా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఇంటి దగ్గర ఉండి పనిచేసే వారి సంఖ్య త్వరలోనే 500కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాజీనామాలు చేసినవారు కూడా.. ఈ కొత్త విధానం చూసి వాటిని ఉపసంహరించుకునేందుకు ఆలోచిస్తారు' అని ఆమె చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకులో 30 శాతం మంది అంటే 73 వేల మంది మహిళలు పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు