చిన్నారుల‌కు సెప్టెంబ‌ర్ నాటికి అందుబాటులోకి కొవాగ్జిన్ వ్యాక్సిన్..

- June 22, 2021 , by Maagulf
చిన్నారుల‌కు సెప్టెంబ‌ర్ నాటికి అందుబాటులోకి కొవాగ్జిన్ వ్యాక్సిన్..

న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయాల్సింది.ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. 18 ఏళ్లు దిగువన ఉన్న చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు.. అయితే, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మాత్రం జరుగుతున్నాయి.చిన్నారులకు వ్యాక్సిన్‌పై స్పందించిన ఎయిమ్స్‌ చీఫ్ రణదీప్ గులేరియా..ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నాటికి చిన్నారులకు కూడా కోవాగ్జిన్‌ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు.రెండేళ్లు పైబడిన చిన్నారులకు ఆ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు అన్నారు.ఇప్పటికే పిల్లల‌పై కొవాగ్జిన్ చేప‌ట్టిన‌ రెండు, మూడో ద‌శ ట్రయల్స్‌కు సంబంధించిన డేటా సెప్టెంబ‌ర్‌లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని.. అదే నెల‌లో వ్యాక్సిన్‌కు అనుమ‌తి ల‌భిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు గులేరియా.. అంతేకాదు.. ఫైజ‌ర్, బ‌యోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు భార‌త్‌లో అనుమతి ఇస్తే.. అవి కూడా పిల్లలకు అందించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.

ఢిల్లీ ఎయిమ్స్, WHO సంయుక్తంగా అధ్యయనం చేయగా.. పిల్లలలో అధిక సెరో-పాజిటివిటీ ఉన్నట్టు కనుగొన్నారు.కోవిడ్ థర్డ్ వేవ్ ఇతరులకన్నా పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేయదని ఈ అధ్యయనం ప్రారంభ ఫలితాల్లో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com