ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లేశ్వరి
- June 22, 2021
న్యూ ఢిల్లీ: ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది ప్రభుత్వం.దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని ఢిల్లీలో తొలిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం.ఆ యూనివర్సిటీ తొలి వీసీగా కరణం మల్లేశ్వరికి అవకాశం దక్కింది.ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్‌గా ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం.ఇక, క్రీడాకారులు ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందే అవకాశం ఉంటుంది.కాగా, సిడ్నీలో 2000 సమ్మర్ ఒలింపిక్స్‌లో 240 కేజీల బరువు ఎత్తి కొత్త శకాన్ని సృష్టించారు భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి. ఆమె భారత్‌కు కాంస్యపతకం సాధించి పెట్టారు.1975 జూన్ 1న చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామములో జన్మించారు మల్లేశ్వరి..కానీ, ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలసలో స్థిరపడ్డారు. ఇప్పుడు ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ తొలి వీసీగా రికార్డులోకి ఎక్కారు.
తాజా వార్తలు
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!







