వ్యాక్సిన్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ డ్రైవ్ ప్రారంభించిన ఇండియన్ ఎంబసీ

- June 23, 2021 , by Maagulf
వ్యాక్సిన్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ డ్రైవ్ ప్రారంభించిన ఇండియన్ ఎంబసీ

కువైట్: ట్రావెల్ బ్యాన్ తో చిక్కుకుపోయిన భారతీయుల ప్రయాణ అడ్డంకులను తొలగించేందుకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేపట్టింది. అలాగే ఇతర ప్రయాణ అడ్డంకులపై ఫోకస్ చేసింది. ఆగస్ట్ 1 నుంచి భారత్ పై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు కువైట్ మంత్రిమండలి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి ఎంబసీ అధికారులు భారతీయుల ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేందుకు ఈ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా భారతీయ ప్రయాణికులు వ్యాక్సిన్ తీసుకున్నారా..లేదా..తీసుకుంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ వివరాలను సేకరించటంతో పాటు ప్రయాణానికి కావాల్సిన ఇతర అంశాలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని..సంబంధిత కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులను తొలగించటమే ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం. భారత ప్రయాణికులుhttp://https://forms.gle/ZgRpFBTFV5V24Vqb8 ద్వారా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని ఎంబసీ కార్యాలయం కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com