బ్యాంక్ నుంచి వస్తున్న మహిళ దగ్గర దోపిడి..ముగ్గురు అరెస్ట్

- June 23, 2021 , by Maagulf
బ్యాంక్ నుంచి వస్తున్న మహిళ దగ్గర దోపిడి..ముగ్గురు అరెస్ట్

యూఏఈ: ఓ అసియా మహిళ నుంచి Dh170,000 దొంగిలించిన కేసులు ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే నిందితుల్ని పట్టుకొని ఆమెకు డబ్బులు అప్పజెప్పటం విశేషం. దుబాయ్‌లోని అల్ క్వోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఆసియాకు చెందిన మహిళా. తాను విధులు నిర్వహించే సంస్థ తరపున ప్రతి రోజు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయటం, విత్ డ్రా చేయటం ఆమె డ్యూటీ. అయితే..ఆమె కదలికలపై గమనిస్తూ వచ్చిన ముగ్గురు సభ్యుల ఆఫ్రికన్ గ్యాంగ్ బ్యాంక్ కు వెళ్తున్న ఆమెను ఫాలో అయ్యారు. బ్యాంక్ నుంచి Dh170,000 విత్ డ్రా చేసుకొని వస్తుండగా దాడి చేసి నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com