బ్యాంక్ నుంచి వస్తున్న మహిళ దగ్గర దోపిడి..ముగ్గురు అరెస్ట్
- June 23, 2021
యూఏఈ: ఓ అసియా మహిళ నుంచి Dh170,000 దొంగిలించిన కేసులు ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే నిందితుల్ని పట్టుకొని ఆమెకు డబ్బులు అప్పజెప్పటం విశేషం. దుబాయ్‌లోని అల్ క్వోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఆసియాకు చెందిన మహిళా. తాను విధులు నిర్వహించే సంస్థ తరపున ప్రతి రోజు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయటం, విత్ డ్రా చేయటం ఆమె డ్యూటీ. అయితే..ఆమె కదలికలపై గమనిస్తూ వచ్చిన ముగ్గురు సభ్యుల ఆఫ్రికన్ గ్యాంగ్ బ్యాంక్ కు వెళ్తున్న ఆమెను ఫాలో అయ్యారు. బ్యాంక్ నుంచి Dh170,000 విత్ డ్రా చేసుకొని వస్తుండగా దాడి చేసి నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







