ఎయిర్ ఇండియా విమానంలో ఒకే ఒక్క వలసదారుడి ప్రయాణం
- June 23, 2021
ఇండియా నుంచి యూఏఈకి ఓ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు ప్రయాణించాడు. ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ అనే ఓ వ్యాపారవేత్త పంజాబ్‌లోని అమ్రిత్సర్ నుంచి దుబాయ్‌కి ఎయిర్ ఇండియా విమానం ఎఐ929 ద్వారా బుధవారం ప్రయాణించారు. తన అడుగుల ద్వారా విమానం పొడవుని కొలిచినట్లు సింగ్ వెల్లడించారు. సింగ్, యూఏఈ గోల్డెన్ వీసా కలిగి వున్న వ్యక్తి. జూన్ 12న దుబాయ్‌కి వెళ్ళారాయన. గోల్డెన్ వీసా కలిగి వుండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయని ఆయన వివరించారు. ఏప్రిల్ 24 నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులపై యూఏఈ తాత్కాలిక నిషేధం విధించింది కరోనా నేపథ్యంలో. కొన్ని వర్గాలకు చెందినవారికి మాత్రం మినహాయింపునిచ్చింది. గోల్డెన్ వీసా కలిగినవారికి, డిప్లమాటిక్ మిషన్స్‌పై వచ్చేవారు.. ఇలా కొందరికి వెసులుబాటు కల్పించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









