'మా' బరిలో హేమ
- June 23, 2021
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు రానే వచ్చాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీకాలం ముగియనుండడంతో టాలీవుడ్‌లో ఎలక్షన్ హడావిడి మొదలైంది. ఇప్పటికే మా అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ ఉండగా తాజాగా సీనియర్ నటి హేమ కూడా ఎన్నికల్లో నిలబడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా మా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా అనేక పదవులు చేపట్టాను. ఆయా పదవులకు న్యాయం చేశాను. ఈసారి ట్రెజరర్‌గా పోటీ చేయాలనుకున్నాను. కానీ నా ఆలోచన మార్చుకున్నాను.
ఎలక్షన్స్ ప్రకటించగానే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత గారు పోటీ చేస్తున్నారని తెలిసింది. పెద్దలు ఎన్నికల బరిలో దిగుతున్నారని తెలిసాక.. పోటీ చేయొద్దని అనుకున్నా. కానీ సినీ ప్రముఖుల నుంచి వత్తిడి వచ్చింది. ఇంతకు ముందు నేను పోటీ చేసినప్పుడు నన్ను మెజారిటీతో గెలిపించిన సినీ ప్రముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయకూడదని అన్నారు. పరిశ్రమకు సంబంధించి ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు. అందుకే నువ్వు బరిలో ఉండాలి అన్నారు. పోటీ చేయనని చెప్పినా వినకుండా నాపై ఒత్తిడి చేస్తున్నారు. దాంతో నాకు అండగా నిలిచిన వారందరి కోసం, నా వారి కోసం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను అని హేమ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







