అక్రమ శాటిలైట్ డిషెస్ తొలగింపుకు డెడ్‌లైన్
- March 08, 2016
sడిస్కవరీ గార్డెర్స్లో నివాసం ఉంటోన్నవారికి నఖీల్ మార్చ్ 10వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. వెంటనే అక్రమంగా ఏర్పాటు చేసిన శాటిలైట్ డిషెస్ లేదా యాంటినాస్ని రూఫ్స్ మరియు బాల్కనీల నుంచి తొలగించాలనీ, లేదంటే భారీగా జరీమానాలు విధింపబడ్తాయనీ నఖీల్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. నఖీల్ ఫెసిలిటీస్ మరియు ఓనర్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి నోటీసులను జారీ చేసింది. 20,000 రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్‌తో అతి పెద్ద కమ్యూనిటీగా ఉంది ఇది. అక్రమంగా డిష్‌లను ఏర్పాటు చేస్తే 500 దిర్హామ్‌ల వరకు ఫైన్ విధించే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. 2015 మార్చ్‌లో అబుదాబీ మున్సిపాలిటీ 2000 దిర్హామ్‌ల ఫైన్‌ని అక్రమ డిష్‌లు వినియోగించేవారికి విధిస్తూ నిర్ణయం తీసుకుంది. షార్జాలో ఈ ఫైన్ 500 దిర్హామ్‌లుగా ఉంది. షార్జాలో 1997లోనే డిష్ యాంటెనాలపై నిషేధం ఉంది. 2012 నుంచి శాటిలైట్ టీవీ డిష్‌ల కోసం నిబంధనను సవరించి, కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









