హ్యాపీ విమన్స్ డే:

ఎక్కడో సూర్యుడు
ఇక్కడ వెలుగివ్వడం ఏంటి?
ఇదంతా
స్త్రీ సౌందర్య కాంతి

కలాలకి,కుంచెలకి
ప్రాణం వస్తుంది
స్త్రీని
చూడగానే.

అప్సరసలు
బ్రహ్మపై దండెత్తారు;
నేలపై
స్త్రీల అందం చూసి.

గంగలో ఎటు మునిగినా
పుణ్యమే;
స్త్రీని ఎటునుంచి చూసినా
అందమే.

పువ్వులో
పువ్వులు పుట్టాయి;
పద్మంలాంటి ముఖంలో
కలువల్లాంటి కళ్లు.

భర్త పోతే
గాజులు తీసెయ్యాలా?
భార్య పోతే
గాజులు తొడుక్కుంటాడా?

-సిరాశ్రీ

Back to Top