భార్యను హత్య చేసిన కేసులో నేపాల్ వ్యక్తికి జీవిత ఖైదు
- June 24, 2021
దుబాయ్: భార్యను హత్య చేసిన కేసులో అరెస్టైన నేపాల్ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ దుబాయ్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడు నేపాల్ వ్యక్తి. తల, మెడ, ఛాతి, పొత్తికడుపులో 11 సార్లు పొడిచాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో అక్కడికక్కడే కుప్పకూలింది. చనిపోయిన భార్యను ఫోటో తీసిన తర్వాత హంతకుడు పోలీసులకు సమాచారం అందించాడు. 2020, సెప్టెంబర్ 25న ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసును న్యాయ విచారణకు బదిలీ చేశారు. విచారణ ముగియటంతో హంతకుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, శిక్షా కాలం తర్వాత దేశబహిష్కరణ విధిస్తూ తీర్పునిచ్చింది. యూఏఈ చట్టాల మేరకు 25 ఏళ్ల జైలు శిక్షే గరిష్ట కాలం.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







