SOS, హజ్ సేవలతో తవక్కల్నా యాప్ అప్ డేట్
- June 24, 2021
సౌదీ: హజ్, ఉమ్రా ప్రార్థనల కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తవక్కల్నా యాప్ ను అప్ డేట్ చేసినట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు. మక్కాలోని పవిత్ర స్థలాల సందర్శన టికెట్ల కొనుగోలు, SOS సర్వీస్, ఫోన్ నెంబర్ లను అప్ డేట్ చేసేలా కొత్త ఫీచర్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ అప్ డేషన్ తో హజ్ యాత్రికుల ఇన్ట్సిట్యూషన్ క్వారంటైన్ కు కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు దోహదపడుతుంది. అలాగే ఉమ్రా ప్రార్థనలు, హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే వారిని ఆమోదించటం, తిరస్కరించేందుకు యాప్ సేవలను వినియోగించనున్నారు. అంతేకాదు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో అధికారులను వెంటనే సంప్రదించవచ్చు. అందుకు అనుగుణంగా SOS దోహదపడుతుంది. SOS సర్వీస్ ద్వారా సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీకి సమాచారం ఇవ్వొచ్చు.
అలాగే వారి ఎమర్జెన్సీ సేవల వినతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సౌదీ పౌరులు, ప్రవాసీయులు, జీసీసీ పౌరులు, పర్యాటకులు తమ ఫోన్ నెంబర్ అప్ డేట్ చేయటం ద్వారా తవక్కల్నా యాప్ లో సైన్ ఇన్ అవ్వొచ్చు.
తాజా వార్తలు
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి
- పేద మహిళలను అక్రమంగా గల్ఫ్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు..భారత్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్
- కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..
- కువైట్‌లో మాదకద్రవ్యాల కేసులో రాజకుటుంబ సభ్యుడి అరెస్ట్..
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్
- బహ్రెయిన్‌లో సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం విస్తరణ..!!
- ఖతార్–కెనడా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ..!!
- సౌదీపై దాడులను ఖండించిన పలు దేశాలు..!!
- యూఏఈ జాతీయ దినోత్సవం.. వాహనదారులకు శుభవార్త..!!







