మరో 3 నెలల పాటు ప్రభుత్వ సాయం 'తమ్కీన్' పొడిగింపు
- June 24, 2021
బహ్రెయిన్: వివిధ రంగాల్లోని వ్యాపారులు, కార్మికులకు ఆర్ధిక సాయాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కార్మిక నిధి-తమ్కీన్ ప్రకటించింది. జూన్, జులై, ఆగస్ట్ మాసాల్లో ఆయా రంగాలకు ఈ ఆర్ధిక సాయం, వెసులుబాట్లు కల్పించనుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్ధిక రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఎదుర్కొని, స్థిరమైన అభివృద్ధి సాధించే చర్యల్లో భాగంగా బహ్రెయిన్ పలు రంగాలకు ఆర్ధిక మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రకటించిన ఆర్ధిక మద్దతు పిల్లల ఆట విశ్రాంతి కేంద్రాలు, డే కేర్ సెంటర్లు, సినిమాలు, జిమ్, ఫిట్‌నెస్ స్టూడియోలు, సెలూన్లు, స్పా, రెస్టారెంట్లు, కేఫ్ రంగాలు ఆర్ధిక మద్దతు ద్వారా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. ప్రధానంగా భోజన సేవలు, ఈవెంట్స్ హాల్స్, రిటైల్ షాపులు (ఆహారేతర వస్తువులు), ట్రావెల్ అండ్ టూరిజం ఏజెన్సీలు, ఈవెంట్ ప్లానింగ్ కంపెనీలకు ఆర్ధిక సాయం అందించేలా తమ్కీన్ యోచిస్తోంది. అలాగే టాక్సీ, బస్సు డ్రైవర్లు, డ్రైవింగ్ ట్రైనర్ల జీతాలకు కూడా మూడు నెలల పాటు మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. సహాయక కార్యక్రమం నుండి లబ్ది పొందే రంగాల అర్హత ప్రమాణాలు తమ్కీన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







