3 ఏళ్లలో 9 చమురు బావులు, 8 ఆయిల్ రిజర్వాయర్లను కనుగొన్న కువైట్
- June 24, 2021
కువైట్: చమురు అన్వేషణలో కువైట్ గత మూడేళ్లలో ఆశాజనక ఫలితాలను సాధించిందని కువైట్ స్పష్టం చేసింది. 2018 నుంచి మూడేళ్లలో 9 చమురు బావులు, 8 పెద్ద ఆయిల్ రిజర్వాయర్లను కనుగొన్నట్లు వెల్లడించింది. ఇందులో రెండు బావులను 2021 మార్చిలో అసెట్ మేనేజ్మెంట్ సెక్టార్ కి బదిలీ చేసినట్లు తెలిపింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 6 కొత్త బావులు యబ్బెత్ ఫీల్డ్ లో అల్-మనాకీష్, అల్-రావ్దైన్ ఫీల్డ్‌లోని హేత్ రిజర్వాయర్, కహ్లులా ఫీల్డ్‌లో దిగువ అల్-మరాత్, అల్-మరాత్ కషానియా, హోమాలో అల్-మరాత్, మరియు కబ్ద్ క్షేత్రంలో నజ్మా సర్జెలో కనుగొన్న విషయం తెలిసిందే. అయితే చమురు బావుల నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయిల్ ఉత్పత్తి దశకు చేరుకోవాలంటే నిర్దిష్ట ప్రమాణాలతో అనేక దశలను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది.
తాజా వార్తలు
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!







