తెలంగాణ: నేటి నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్
- June 24, 2021
హైదరాబాద్: తెలంగాణ లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బందికి నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వీరికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. వచ్చే నెల 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం హైరిస్క్ జాబితాలో చేర్చింది.వీరికోసం వైద్యారోగ్య శాఖ ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టింది. విద్యాసంస్థల్లో పనిచేస్తే ప్రతి ఒక్కరు ఈ నెల 30 వరకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని అధికారులు సూచించారు.మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ లు వేయనున్నారు. ప్రతి కేంద్రంలో సీఆర్పీ లేదా ఉపాధ్యాయుడు ఒకరు ఉంటారని, సిబ్బంది తమ ఐడీ కార్డు, ఆధార్ కార్డు చూపించి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!







