ఒమన్‌లో పెరుగుతున్న వైవాహిక వేధింపులు

- March 08, 2016 , by Maagulf
ఒమన్‌లో పెరుగుతున్న వైవాహిక వేధింపులు


 వైవహిక వేధింపులు ఒమన్‌లో పెరుగుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. పెరుగుతున్న అవగాహన కారణంగా వేధింపుల కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయనీ, ఇలాంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బిహేవియరల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఖావ్లా అల్‌ వహాబి మాట్లాడుతూ, వైవాహిక వేధింపులను తొలి దిశలోనే మహిళలు గుర్తించి, ఫిర్యాదు చేయాలని సూచించారు. తన వద్దకు ప్రతి నెలా ఐదు కేసులు ఇలాంటివి వస్తుంటాయని, వైవాహిక వేధింపులతో మహిళల్లో అనేక రకాలైన మానసిక, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. చాలామంది మహిళలు సమస్యల్ని పరిష్కరించుకోగలమని అనుకుంటారనీ, కొన్ని సందర్భాల్లో విధిలేక వాటిని భరిస్తుంటారని అల్‌ వహాబి వివరించారు. 140 మంది మహిళలను ఈ అంశంపై ప్రశ్నించగా, అందులో 60 శాతం మంది అనగా 90 మంది వైవాహిక వేధింపులకు సంబంధించి తాము బాధితులమని ఒప్పుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా ఒమన్‌ సొసైటీ తరఫున సుల్తాన్‌ బూస్‌ యూనివర్సిటీ ఇటీవల ఓ వర్క్‌షాప్‌ కూడా నిర్వహించింది. ఇందులో చట్టబద్ధమైన పరిష్కారాలు, సామాజిక కోణాలు వంటి వాటి గురించి చర్చించారు. వైవాహిక వేధింపుల్లో ఎక్కువగా ఇంటిమేట్‌ పార్టనర్‌ వయొలెన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com