జూలై 31 లోపుగా 12వ తరగతి ఫలితాలు విడుల చేయాలి: సుప్రీంకోర్టు ..
- June 24, 2021
ఢిల్లీ: జులై 31 లోగా ఇంటర్ ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెస్మెంట్ కోసం 10 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో పరీక్షల రద్దయ్యాయి. కాగా.. ఈ నెల మొదటి వారంలో విద్యార్థుల మార్కులకు సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాల్సిందిగా సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈలను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డుల మాదిరే సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ కూడా జులై 31లోగా ఫలితాలను వెల్లడించాలని పేర్కొంది. గత వారమే రెండు బోర్డులు కూడా మార్కులు వేసే విధానాన్ని కోర్టుకు సమర్పించాయి. ఆ అఫిడవిట్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. వ్యతిరేకించేందుకు ఆ విధానాల్లో లోపాలేవీ లేవని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించాలన్న కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఇప్పటిదాకా 21 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా.. ఆరు రాష్ట్రాల్లో నిర్వహించారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







